paruchuri: ఆ కథ తనకి ఇస్తే బాగుండేదని చిరంజీవి అన్నారు: పరుచూరి గోపాలకృష్ణ

  • పెద్ద నిర్మాతలు సిద్ధంగా ఉండేవారు 
  • చిన్న సినిమాల పట్లనే ఆసక్తి చూపేవారు
  • కథ ఇచ్చేశాక మాకు అలా అనిపించింది
తాజాగా పరుచూరి గోపాలకృష్ణ తన పరుచూరి పలుకులు కార్యక్రమంలో దర్శకుడు ఎ. మోహన్ గాంధీ తో తమకి గల అనుబంధాన్ని గురించి ప్రస్తావించారు. మోహన్ గాంధీగారు దర్శకత్వం వహించిన 'కర్తవ్యం' .. 'ఆశయం' .. 'ఆడపడచు' సినిమాలకి మేము పనిచేశాము. మోహన్ గాంధీగారు పాటలను కూడా చాలా బాగా చిత్రీకరిస్తారు. ఆయన సినిమాల్లోని పాటలను రాఘవేంద్రరావు తీశాడేమోనని అనిపించేలా ఉంటాయి.

పెద్ద పెద్ద నిర్మాతలు సైతం మోహన్ గాంధీతో సినిమా చేయించుకోవడానికి సిద్ధంగా వుండేవారు. కానీ ఆయన చిన్న సినిమాలు చేయడానికే ఎక్కువ ఆసక్తిని చూపేవారు. అలా శివకృష్ణ హీరోగా ఆయన తెరకెక్కించిన 'ఆడపడచు' కూడా సూపర్ హిట్ అయింది. ఆ సినిమా చూసిన చిరంజీవి ఇలాంటి కథలు తనకి కావాలనీ .. ఈ కథను తనకి ఇచ్చి వుంటే బాగుండేదని అన్నారు. కథ ఇచ్చేసిన తరువాత మాకు అనిపించింది .. ఈ కథ  పెద్ద హీరోలకి కూడా పనికి వస్తుందని" అని చెప్పుకొచ్చారు.  
paruchuri
mohan gandhi

More Telugu News