chiranjeevi: తండ్రి హిట్ సినిమా టైటిల్‌తో రానున్న చెర్రీ!

షార్ట్స్‌లో చూడండి
గతంలో విజయాన్ని సాధించి బాగా ప్రాచుర్యం పొందిన సినిమా టైటిల్స్‌ను తిరిగి వాడటం పరిపాటే. ఇటీవల మెగా హీరో వరుణ్ తేజ్ తన బాబాయి సినిమా టైటిల్‌ ‘తొలిప్రేమ’ను తన సినిమాకు పెట్టిన విషయం తెలిసిందే. అలాగే ఇప్పుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన తండ్రి మెగాస్టార్ చిరంజీవి టైటిల్‌ను వాడబోతున్నాడని సమాచారం.

బోయపాటి శ్రీను దర్శకత్వంలో చెర్రీ హీరోగా ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు 'స్టేట్ రౌడీ' అనే టైటిల్‌ను పెట్టాలనే ఆలోచనలో చిత్రబృందం ఉందని తెలుస్తోంది. చిరంజీవి, రాధ జంటగా ఇదే టైటిల్ తో తెరకెక్కిన సినిమా 1989లో మంచి విజయాన్ని అందుకుంది. ఈ క్రమంలో అప్పుడే ఈ సినిమా టైటిల్ ‘స్టేట్ రౌడీ’ అంటూ అభిమానులు తయారు చేసిన పోస్టర్లు సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్ చేస్తున్నాయి. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న చెర్రీ సినిమా ప్రస్తుత షెడ్యూల్ యూరప్‌లోని అజర్‌బైజాన్‌లో జరుగుతోంది. 
Go Back to Shorts
chiranjeevi
ram charan
varun tej
tholi prema
state rowdi

More Telugu News