kcr: కేసీఆర్ తో 25 ఏళ్లకు పైగా స్నేహం ఉన్న ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ గారికి కూడా ఆ విషయం తెలుసు: కవిత

  • కేసీఆర్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎలా ఉన్నారో.. ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు
  • కేసీఆర్ ఎవరినీ కలవరు అనే మాటలు అనవసర ఆరోపణలే
  • అసెంబ్లీ ఎన్నికల్లో మహాకూటమి ప్రభావం ఉండదు
ముఖ్యమంత్రి కేసీఆర్ ది మార్పు వచ్చే పర్సనాలిటీ కాదని టీఆర్ఎస్ ఎంపీ కవిత అన్నారు. వ్యక్తి, వ్యక్తిత్వాలు అనేవి ముఖ్యమంత్రి పదవి రాగానే మారిపోయేవి కాదని ఆమె తెలిపారు. పనితీరు, మాట్లాడే స్టైల్, సింప్లిసిటీలో కేసీఆర్ ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఎలాంటి మార్పు లేదని చెప్పారు. ఆయన ఒకప్పుడు ఎలా ఉన్నారో సీఎం అయిన తర్వాత కూడా అలాగే ఉన్నారని తెలిపారు. కేసీఆర్ ఎవరినీ కలవరు అనే మాటలు అనవసర ఆరోపణలు మాత్రమేనని చెప్పారు. ఈ విషయం కేసీఆర్ తో 25 ఏళ్లకు పైగా స్నేహం ఉన్న ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ గారికి కూడా తెలుసని అన్నారు.

తెలంగాణ ఎన్నికల్లో మహాకూటమి ప్రభావం ఏమాత్రం ఉండదని కవిత అన్నారు. తెలంగాణలో టీడీపీ లేదని... ఇద్దరు, ముగ్గురు నేతలు మినహా మిగిలిన నాయకులు, కార్యకర్తలంతా టీఆర్ఎస్ లో చేరారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నవారంతా ఔట్ డేటెడ్ నేతలేనని, ప్రజాభిమానం కలిగిన వారు ఎవరూ లేరని ఎద్దేవా చేశారు. కమ్యూనిస్టులకు ఉన్న ఓట్లు చాలా తక్కువని... టీజేఎస్ కు నేతలు, కార్యకర్తలు కూడా లేరని చెప్పారు. 
kcr
kavitha
radhakrishna
andhrajyothi

More Telugu News