Sania Mirza: "బావా ఓ సారిటు చూడవా?": షోయబ్ మాలిక్ కు భారత అభిమానుల పలకరింపు!

  • షోయబ్ మాలిక్ పై అభిమానాన్ని చూపిన ఫ్యాన్స్
  • నవ్వుతూ చేతులు ఊపిన మాలిక్
  • పాక్ తో మ్యాచ్ సందర్భంగా ఘటన
టెన్నిస్ స్టార్ సానియా మీర్జాను వివాహం చేసుకున్న షోయబ్ మాలిక్ ను, భారత క్రికెట్ అభిమానులు 'బావా' అంటూ పిలిచి, తమ అభిమానాన్ని చూపించారు. ఈ ఘటన ఆసియా కప్ సూపర్-4లో భాగంగా పాకిస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో చోటు చేసుకుంది. షోయబ్ 78 పరుగులు చేసి, పాకిస్థాన్ ను గట్టున పడేసేందుకు ప్రయత్నించినా, ఫలితం దక్కలేదు. షోయబ్ మాలిక్ ఫీల్డింగ్ చేస్తున్న వేళ, బౌండరీ లైన్ వద్ద ఆయన ఉండగా, ఫ్యాన్స్ "జీజూ (బావా)... ఇటు చూడు" అంటూ కేకలు పెట్టారు. వారి అరుపులను విన్న మాలిక్ సైతం వారివైపు చూసి, నవ్వుతూ చేతులు ఊపి అభివాదం చేశాడు. కాగా, ఈ మ్యాచ్ లో భారత్ చేతిలో పాక్ 9 వికెట్ల తేడాతో ఓటమి పాలైన సంగతి తెలిసిందే.
Sania Mirza
Shoaib Malik
India
Pakistan
Cricket

More Telugu News