Andhra Pradesh: అమృత్ పథకం అమలులో మొదటి స్థానంలో నిలిచిన ఏపీ.. 4వ స్థానంలో తెలంగాణ!

  • అవార్డు అందుకున్న అమృత్ మిషన్ ఏపీ డైరెక్టర్ కె.కన్నబాబు
  • 65.24 శాతం మార్కులతో మొదటి స్థానంలో ఏపీ
  • 52.39 శాతం మార్కులతో 4వ స్థానంలో తెలంగాణ
కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన 'అమృత్ పథకం' అమలులో జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో నిలిచింది. నగరాలలో మంచినీటి సరఫరా, మురుగు నీరు, వరద నీరు పారుదల, పారిశుద్ధ్య కార్యక్రమాలు, చెత్త సేకరణ వంటి పనులు సమర్థవంతంగా నిర్వహించేందుకు 2015 జూన్ 25న కేంద్రం ఈ పథకం ప్రవేశపెట్టింది.

రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో ఈ పథకం అమలు తీరు ఆధారంగా కేంద్రం ర్యాంకులు ఇస్తోంది. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మొదటి మూడు సంవత్సరాలలో ఈ పథకం అమలును సమీక్షించి ఇచ్చిన ర్యాంకుల ఆధారంగా ఏపీ 65.24 శాతం మార్కులతో మొదటి స్థానం సాధించింది. 59.17 శాతం మార్కులతో ఒడిస్సా రెండవ స్థానంలో, 54.32 శాతం మార్కులతో మధ్యప్రదేశ్ మూడవ స్థానంలో, 52.39 శాతం మార్కులతో తెలంగాణ 4వ స్థానంలో నిలిచాయి.

ఈరోజు ఢిల్లీలో జరిగిన 'ఈజ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్' జాతీయ సమావేశంలో కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి హర్ దీప్ సింగ్ పూరీ, ఏపీ పట్టణ పరిపాలన శాఖ, అమృత్ మిషన్ ఏపీ డైరెక్టర్ కె.కన్నబాబుకు అవార్డుని అందజేశారు.
Andhra Pradesh
Chandrababu

More Telugu News