VH: అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయను.. కాంగ్రెస్ నేత వీహెచ్ షాకింగ్ ప్రకటన!

  • గతంలో ప్రచార కమిటీ చీఫ్ గా చేయకపోవడంపై అలక
  • ప్రాణం పోయేవరకూ కాంగ్రెస్ లోనే ఉంటానని ప్రకటన
  • జగ్గారెడ్డిని కలుసుకున్న వీహెచ్
తెలంగాణ కాంగ్రెస్ ఎన్నికల ప్రచార కమిటీ సారథ్య బాధ్యతలను ఆశించి భంగపడ్డ ఆ పార్టీ సీనియర్ నేత వీహెచ్ హనుమంతరావు సంచలన ప్రకటన చేశారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేయబోనని ప్రకటించారు. ఈ రోజు కాంగ్రెస్ నేత జగ్గారెడ్డిని వీహెచ్ కలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ప్రాణం పోయేవరకూ కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానని స్పష్టం చేశారు. పార్టీ మారే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. కేసీఆర్ పాలనకు చరమగీతం పాడటమే తన లక్ష్యమని అన్నారు. కాగా, పార్టీ అధిష్ఠానం తీరుతో మనస్తాపం చెందే వీహెచ్ ఈ నిర్ణయం తీసుకున్నారని కొందరు, వయసు రీత్యా రాజకీయాల నుంచి తప్పుకున్నారని మరికొందరు చెప్పుకుంటున్నారు.
VH
Telangana
ratirement
assembly elections

More Telugu News