Rahul Gandhi: తనయుడితో కలసి రాహుల్ గాంధీతో జానారెడ్డి భేటీ.. 'వన్ ఫ్యామిలీ-వన్ టికెట్' నుంచి మినహాయించాలని విజ్ఞప్తి!

  • ఈరోజు ఢిల్లీకి బయలుదేరిన జానా
  • రాహుల్ తో రెండో సీటుపై చర్చ
  • రాహుల్ హామీపై ఇంకా రాని స్పష్టత
తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి, ఆయన కుమారుడు రఘువీర్ ఈ రోజు పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణలో రాజకీయ పరిస్థితి, ఎన్నికల్లో పార్టీ సంసిద్ధతపై చర్చించారు. అలాగే 'ఒక కుటుంబానికి ఒకే సీటు' విషయమై రాహుల్ తో సుదీర్ఘంగా మాట్లాడారు.

ఈ నిబంధన నుంచి తమను మినహాయించాలని పార్టీ అధ్యక్షుడికి వారు విజ్ఞప్తి చేశారు. తన కుమారుడు రఘువీర్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే విషయమై రాహుల్ తో జానారెడ్డి మాట్లాడారు. కాగా, రెండో సీటు విషయంలో రాహుల్ జానారెడ్డికి హామీ ఇచ్చారా? లేదా? అన్నది ఇంకా తెలియరాలేదు.
Rahul Gandhi
Jana Reddy
raghuveer
one family one ticket

More Telugu News