jagga reddy: జగ్గారెడ్డికి బెయిల్.. ఈరోజు జైలు నుంచి విడుదల

  • బెయిల్ మంజూరు చేసిన సికింద్రాబాద్ కోర్టు
  • ఈరోజు జైలు నుంచి విడుదల
  • మనుషుల అక్రమ రవాణా ఆరోపణలను ఎదుర్కొంటున్న జగ్గారెడ్డి
మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డికి ఊరట లభించింది. మానవ అక్రమ రవాణా కేసులో సికింద్రాబాదు కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. దీంతో, ఈరోజు ఆయన జైలు నుంచి విడుదల కానున్నారు. ప్రస్తుతం ఆయన నగరంలోని చంచల్ గూడ జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. 2004లో నకిలీ పత్రాలతో పాస్ పోర్టులు ఇప్పించి, మనుషులను అక్రమ రవాణా చేశారనే ఆరోపణలతో జగ్గారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. గుజరాత్ కు చెందిన ముగ్గుర్ని తన కుటుంబసభ్యులుగా పేర్కొంటూ వారిని అమెరికాకు తీసుకెళ్లి వదిలేసి వచ్చినట్టు కేసులో ఆరోపణలు ఉన్నాయి. 
jagga reddy
bail
congress

More Telugu News