Telangana: తెలంగాణలో 50 స్థానాల్లో పోటీకి దిగనున్న దళిత సంఘర్షణ సమితి

  • ప్రకటించిన సమితి జాతీయ సమన్వయకర్త రాధాకృష్ణ
  • అక్టోబర్ 9న అభ్యర్థుల జాబితా విడుదల
  • బహుజనవాదంతో ముందుకు వెళ్తున్న పార్టీలతో పొత్తు
తెలంగాణలో జరగనున్న ఎన్నికల్లో పోటీ చేయనున్నామని దళిత సంఘర్షణ సమితి ప్రకటించింది. 50 మంది అభ్యర్థులు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తారని సమితి జాతీయ సమన్వయకర్త నల్లా రాధాకృష్ణ తెలిపారు. తమ అభ్యర్థులు పోటీ చేయనున్న స్థానాల్లో గెలుపు, ఓటములను నిర్ణయించే శక్తి దళిత ఓటర్లకు ఉందని చెప్పారు. దళితుల సంక్షేమం కోసం ఏ ఒక్క పార్టీ కూడా పని చేయడం లేదని ఆయన విమర్శించారు. బహుజనవాదంతో ముందుకు వెళ్తున్న పార్టీలతో పొత్తు పెట్టుకుంటామని చెప్పారు. అక్టోబర్ 9న కాన్షీరామ్ వర్ధంతి రోజున తమ అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తామని తెలిపారు.  
Telangana
elections
dalit sangharshan samithi

More Telugu News