ఇంటెలిజెన్స్ అధికారులను తెలంగాణలో పెట్టారు.. అందుకే మావోలు రెచ్చిపోయారు!: ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా
- 2014 తర్వాత పోలీస్ విభాగం దిగజారిపోయింది
- అధికారులు కేవలం ప్రోటోకాల్ సేవలకే పరిమితమయ్యారు
- ప్రాణాలు తీయడం ఆమోదయోగ్యం కాదు
నిన్న విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో ఇద్దరు అధికార పార్టీ నేతలను మావోయిస్టులు దారుణంగా హత్యచేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆగ్రహానికి లోనైన గ్రామస్తులు, ఎమ్మెల్యే మద్దతుదారులు డుంబ్రిగూడ పోలీస్ స్టేషన్ పై దాడి చేశారు. దొరికిన పోలీసులను దొరికినట్లు చావబాదారు. అనంతరం బయట ఉన్న పోలీస్ ఔట్ పోస్టుకు నిప్పుపెట్టారు. ఈ ఘటనలో పలు వాహనాలు, ఫైళ్లు కాలి బూడిదయ్యాయి.