Moon: చంద్రుడిలో శిరిడి సాయిబాబా... వైరల్ అవుతున్న ఫొటోలు!

  • చీకటి పడితే చంద్రుడిని చూస్తున్న ప్రజలు
  • సోషల్ మీడియాలో సాయి కనిపిస్తున్నట్టున్న చిత్రాలు
  • మార్ఫింగ్ చేశారంటున్న హేతువాదులు
గడచిన రెండు రోజులుగా తెలుగు రాష్ట్రాల ప్రజలు చీకటి పడితే, చంద్రుడివైపు చూస్తున్నారు. చంద్రుడిలో శిరిడి సాయిబాబా కనిపిస్తున్నారన్న వార్తలు సోషల్ మీడియా పుణ్యమాని వైరల్ కాగా, విషయం తెలిసిన సాయి భక్తులు, ఆకాశం వైపు చూస్తూ చంద్రుడిలో సాయి నీడను వెతుకుతున్నారు. ఇక వాట్స్ యాప్ తదితర సామాజిక మాధ్యమాల్లో సాయి కనిపించేశాడంటూ ఫొటోలు లెక్కకు మిక్కిలిగా షేర్ అవుతున్నాయి. పలు ప్రాంతాల్లో చంద్రుడి వెన్నెలలో మహిళా భక్తులు ప్రత్యేక ప్రార్థనలు, భజనలు చేస్తున్నారు. ఈ ఫొటోలు మార్ఫింగ్ చేసినవి కావచ్చని, గతంలోనూ ఇటువంటి చిత్రాలు వైరల్ అయ్యాయని హేతువాదులు చెబుతున్నప్పటికీ, వినే పరిస్థితిలో ఎవరూ లేరు.
Moon
Shirdi Sai Baba
Viral Videos
whats App
Social Media

More Telugu News