maoist: మావోయిస్టుల ఎఫెక్ట్.. రెండ్రోజుల మన్యం బంద్ కు గిరిజన సంఘాల పిలుపు!

షార్ట్స్‌లో చూడండి
విశాఖ ఏజెన్సీలో అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సోమలను మావోయిస్టులు హత్య చేసిన నేపథ్యంలో గిరిజన సంఘాలు మండిపడుతున్నాయి. తమ నేతలను చంపడంపై గిరిజన యువకులు పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో విశాఖ ఏజెన్సీలో నేడు, రేపు.. రెండ్రోజుల పాటు బంద్ కు గిరిజన సంఘాలు పిలుపునిచ్చాయి. కిడారి, సోమల హంతకులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాయి. కాగా, మావోయిస్టులను ఏరివేసేందుకు విశాఖ మన్యంలో 12 స్పెషల్ పార్టీ పోలీసుల బృందాలు, 8 గ్రేహౌండ్స్ పార్టీలు కూంబింగ్ ప్రారంభించాయి.

మరోవైపు కిడారి, సోమల హత్యల తర్వాత చెలరేగిన అల్లర్లను అదుపు చేయడంతో విఫలమైనందుకు డుంబ్రిగూడ ఎస్సై అమర్ నాథ్ ను సస్పెండ్ చేసినట్లు ఏపీ డీజీపీ ఆర్పీ ఠాకూర్ తెలిపారు. ఈ ఘటనపై ప్రస్తుతం విచారణ కొనసాగుతోందని వెల్లడించారు. 
Go Back to Shorts
maoist
Visakhapatnam District
Telugudesam
MLA
BANDH

More Telugu News