Ramcharan: ఇప్పుడేమో తినమని పెడతాడు, తరువాత జిమ్ లో చంపుతాడు!: చెర్రీపై ఉపాసన ట్వీట్

షార్ట్స్‌లో చూడండి
అభిమానులతో ఎప్పుడూ టచ్ లో ఉంటూ, తన భర్త రామ్ చరణ్ విశేషాలను ఎప్పుడూ పంచుకుంటూ ఉండే ఉపాసన పెట్టిన తాజా ట్వీట్ ఒకటి వైరల్ అవుతోంది. ఏది కావాలంటే, అది తినాలని చెబుతూ, దగ్గరుండి తినిపించే తన భర్త, ఆపై జిమ్ లో కష్టపడాలంటూ చంపుతున్నాడని మురిపెంగా వాపోయింది. తనకు రామ్ చరణ్ తినిపిస్తున్న వీడియోను కూడా ఉపాసన షేర్ చేసుకుంది. ఈ ఏడు సెకన్ల వీడియోలో స్పూన్ తో ఉపాసనకు డిజర్ట్స్ తినిపించిన చెర్రీ, ఆపై ప్రేమతో ఆమె బుగ్గను గిల్లిన దృశ్యం కనిపిస్తోంది. నిన్న రాత్రి ఉపాసన ఈ వీడియోను షేర్ చేసుకోగా, ఇప్పటికే అది వేలకొద్దీ లైక్స్, షేర్స్ తెచ్చుకుంది. దాన్ని మీరూ చూసేయండి.
Go Back to Shorts
Ramcharan
Upasana
Twitter

More Telugu News