Ganesh: బైబై గణేశా... భక్తుల జయజయధ్వానాల మధ్య ముగిసిన ఖైరతాబాద్ గణేశుని నిమజ్జనం

  • 12.55 గంటల సమయంలో నిమజ్జనం
  • ఉదయం 6 గంటల నుంచి సాగిన యాత్ర
  • చివరి పూజలు చేసిన తలసాని, చింతల
ఖైరతాబాద్ లో కొలువుదీరిన 57 అడుగుల సప్తముఖ కాళసర్ప మహా గణపతి నిమజ్జనం పూర్తయింది. గత సంవత్సరంతో పోలిస్తే, కాస్తంత ముందుగానే ఈ క్రతువును పూర్తి చేశారు. ఈ ఉదయం 6 గంటల సమయంలో ఖైరతాబాద్ నుంచి కదిలిన వినాయకుడు, సరిగ్గా 12.55 గంటల ప్రాంతంలో గంగమ్మ ఒడికి చేరుకున్నాడు. భారీ క్రేన్ విగ్రహాన్ని పైకి తీసుకెళుతుంటే, భక్తులు జయజయధ్వానాలు పలికారు. అంతకుముందు వివిధ పార్టీల నేతలు తలసాని శ్రీనివాసయాదవ్, చింతల రామచంద్రారెడ్డి తదితరులతో పాటు భాగ్యనగర్ గణేష్ ఉత్సవ కమిటీ పెద్దలు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Ganesh
Nimajjan
Hussain Sagar
Khairatabad

More Telugu News