YSRCP: వైసీపీ తీర్థం పుచ్చుకున్న మాజీ డీఐజీ ఏసురత్నం!

  • ఈ రోజు ఉదయం జగన్ సమక్షంలో చేరిక
  • ప్రజా సంకల్పయాత్రలో కలుసుకున్న ఏసురత్నం
  • జిల్లా రాజకీయాలు, పార్టీ పటిష్టతపై చర్చ
ఓవైపు వైసీపీ నుంచి అధికార టీడీపీలోకి వలసలు సాగుతుంటే వైసీపీలోకి కొత్త ముఖాలు వస్తున్నాయి. తాజాగా మాజీ డీఐజీ చంద్రగిరి ఏసురత్నం ఈరోజు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ప్రస్తుతం వైసీపీ అధినేత జగన్ విశాఖ జిల్లా పెందుర్తిలో ప్రజా సంకల్పయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ రోజు ఉదయం ఆయన జగన్ ను కలుసుకున్నారు.

ఈ సందర్భంగా చంద్రగిరి ఏసురత్నంకు కండువా కప్పిన జగన్ పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం జిల్లాలో పార్టీ పరిస్థితి, తాజా రాజకీయాలపై చర్చించారు. ప్రస్తుతం విశాఖపట్నం జిల్లాలో ప్రజా సంకల్పయాత్ర 268వ రోజు కొనసాగుతున్న సంగతి తెలిసిందే
YSRCP
jagan
Visakhapatnam District
praja sankalp yatra
joined
chandragiri yesuratnam

More Telugu News