Jana Sena: విజయవాడ సెంట్రల్‌ టికెట్‌ ఖరారైతే జనసేనలోకి పారిశ్రామికవేత్త కోగంటి

షార్ట్స్‌లో చూడండి
విజయవాడ సెంట్రల్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని ఆశిస్తున్న ప్రముఖ పారిశ్రామికవేత్త కోగంటి సత్యం ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇందుకోసం ఆయన జనసేన పార్టీవైపు చూస్తున్నారు. ఇప్పటికే హైదరాబాద్‌లోని ఆ పార్టీ పెద్దలను కలిసి తన మనసులో మాట ఆయన వెల్లడించారు. సెంట్రల్‌ సీటు కేటాయిస్తే తాను పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రతిపాదన పెట్టినట్లు సమాచారం. అయితే ఈ సీటును పలువురు ప్రముఖులు ఆశిస్తున్నారు. పైగా జనసేనను తమ మిత్రపక్షంగా భావిస్తున్న వామపక్షాలు అవగాహన కుదిరితే విజయవాడ పశ్చిమ, సెంట్రల్‌ నియోజకవర్గాలను అడగాలని భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో విజయవాడ సెంట్రల్‌ సీటు నుంచి తప్ప మరో చోటు నుంచి తాను పోటీ చేసేది లేదని సత్యం స్పష్టం చేస్తుండడంతో, జనసేన పెద్దలు, ఆ పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ నిర్ణయం ఏమిటన్నది ఆసక్తి రేకెత్తిస్తోంది.
Go Back to Shorts
Jana Sena
Vijayawada
Koganti

More Telugu News