Balapur: బాలాపూర్ లడ్డూ వేలంపై వివాదం!

  • ఓ పథకం ప్రకారం వేలం
  • తమ గ్రామస్తుడికి లడ్డూ ఇవ్వాలని చూశారు
  • ఉత్సవ కమిటీపై ఆశావహుల ఆగ్రహం
ఈ ఉదయం జరిగిన హైదరాబాద్, బాలాపూర్ లడ్డూ వేలంపై వివాదం మొదలైంది. లడ్డూను సొంతం చేసుకోవాలని పలువురు ప్రయత్నించగా, గత సంవత్సరం కన్నా రూ. లక్ష అధికంగా పాడిన, అదే గ్రామానికి చెందిన ఆర్యవైశ్య సంఘం నేత టీ. శ్రీనివాస్ రూ. 16.60 లక్షలకు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. లడ్డూ వేలాన్ని త్వరగా ముగించారని, తమకు అవకాశం ఇవ్వకుండా చూశారని పలువురు ఆశావాదులు మీడియా ముందు తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తమ గ్రామస్తుడికి లడ్డూ దక్కేలా చూడాలని ఉత్సవ కమిటీ ముందుగానే ఓ పథకం ప్రకారం వేలం నిర్వహించిందని, కేవలం 20 సెకన్ల వ్యవధిలోనే ఒకటోసారి, రెండోసారి, మూడోసారి అంటూ పాటను ముగించేశారని కొందరు ఆరోపించారు.
Balapur
Ladoo
Auction

More Telugu News