Miryalaguda: మిర్యాలగూడలో ప్రణయ్ విగ్రహం వద్దంటూ వినతిపత్రాలు!

  • పట్టపగలు మిర్యాలగూడలో ప్రణయ్ పరువు హత్య
  • విగ్రహం పెట్టిస్తానన్న ప్రణయ్ భార్య అమృత
  • వద్దంటున్న కొందరు
నల్గొండ జిల్లా మిర్యాలగూడలో పట్టపగలు, నలుగురూ చూస్తుండగానే పరువు హత్యకు గురైన అమృత వర్షిణి భర్త ప్రణయ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయవద్దని కొందరు ఉన్నతాధికారులకు వినతిపత్రాన్ని ఇచ్చారు. సోషల్ మీడియాలో ఓ వైపు ప్రణయ్ హత్యను సమర్థిస్తూ కొందరు, వ్యతిరేకిస్తూ మరెందరో కామెంట్లు పెడుతున్న వేళ, ఓ న్యాయవాది ఆధ్వర్యంలో మిర్యాలగూడలోని కొందరు డీఎస్పీ, మునిసిపల్, ఎమ్మెల్యేల కార్యాలయాల్లో ప్రణయ్ విగ్రహం వద్దని వినతిపత్రాలు అందించినట్టు తెలుస్తోంది. ప్రణయ్ విగ్రహాన్ని పెడితే, నగరంలో శాంతి భద్రతల సమస్యలు తలెత్తుతాయని, కులాల మధ్య చిచ్చు రేగుతుందని వారు చెప్పినట్టు సమాచారం. కాగా, మిర్యాలగూడ సెంటర్ లో తన భర్త విగ్రహాన్ని పెట్టేందుకు పోరాటం చేస్తానని అమృత వెల్లడించిన సంగతి తెలిసిందే.
Miryalaguda
Pranay
Amrutha
Honor Killing

More Telugu News