Election commission: పోలవరం ముంపు మండలాలపై సస్పెన్స్‌కు తెర.. కీలక నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ
- తెలంగాణ ముందస్తు ఎన్నికలకు మార్గం సుగమం
- పోలవరం ముంపు మండలాలపై స్పష్టత
- ఆయా ప్రాంతాల్లోని ఓటర్లను ఏపీలో విలీనం చేస్తూ ఈసీ నోటిఫికేషన్
త్వరలో తెలంగాణలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కేంద్రం కీలక నోటిఫికేషన్ విడుదల చేసింది. పోలవరం ముంపు మండలాలపై ఇప్పటి వరకు ఉన్న సందిగ్ధతతకు తెరదించింది. పోలవరం ప్రాంతంలోని ఏడు ముంపు మండలాలపై కేంద్ర హోం శాఖ స్పష్టత ఇవ్వడంతో ఆయా మండలాలకు చెందిన ఓటర్లను ఏపీలో విలీనం చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. ఆయా మండలాల ఓటర్లను తాజాగా రంపచోడవరం నియోజకవర్గంలో విలీనం చేశారు. దీంతో పెద్ద సస్పెన్స్‌కు తెరపడింది. ఈ విషయాన్ని ఏపీ ప్రభుత్వం గెజిట్‌లో కూడా ముద్రించింది. ఎన్నికల సంఘం తాజా నోటిఫికేషన్‌తో ఈ ఓటర్లు ఎటువైపన్న సమస్యకు తెరపడింది. ఫలితంగా తెలంగాణ శాసనసభ ఎన్నికలకు మార్గం సుగమమైంది.
ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టం ప్రకారం 2014లో పోలవరంలోని ఏడు మండలాలు, అందులోని 211 గ్రామాలు, 34 వేల కుటుంబాలను ఏపీకి ఇస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఏపీకి అయితే ఇచ్చింది కానీ ఆయా ప్రాంతాలు ఏపీలోని ఏ నియోజకవర్గం కిందికి వస్తాయన్న విషయంలో ఇప్పటి వరకు స్పష్టత లేకుండా పోయింది. తాజాగా అప్పటి నిర్ణయాన్ని ధ్రువీకరిస్తూ కేంద్ర హోంశాఖ ఈ నెల 13 ఎన్నికల సంఘానికి లేఖ ఇచ్చింది. ఈ లేఖ ఆధారంగా ఈసీ ఈ ఏడు మండలాలను ఏపీలోని రంపచోడవరం, పోలవరం నియోజకవర్గాల్లో చేర్చుతూ నోటిఫికేషన్ జారీ చేసింది.