Nellore District: జగన్ సీఎం కావాలని రొట్టెల పంపిణీ!

  • నెల్లూరు జిల్లాలో రొట్టెల పండగ
  • కిటకిటలాడుతున్న దర్గా ప్రాంతం
  • రొట్టెలు పట్టుకున్న మాజీ ఎంపీ మేకపాటి
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కేంద్రంలోని బారాషహీద్‌ దర్గాలో ప్రారంభమైన రొట్టెల పండగ సందర్భంగా స్వర్ణాల చెరువు, పొదలకూరు రోడ్డు, అమరవీరుల సమాధుల ప్రాంతం లక్షలాది మంది భక్తులతో కిటకిటలాడుతోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటూ మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌ రెడ్డి రొట్టెలను పట్టుకున్నారు. నిన్న దర్గా దగ్గరికి వచ్చిన ఆయన ప్రత్యేక పూజలు చేశారు. రొట్టెల పండుగ మూడవ రోజుకు రాగా, నిన్న గంధమహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. కడప దర్గా పీఠాధిపతి ఆధ్వర్యంలో వందలాది మంది భక్తులు, గంధాన్ని ఊరేగింపుగా దర్గాకు తీసుకువచ్చి, బారాషహీదులకు గంధం సమర్పించి, ఆపై భక్తులకు పంపిణీ చేశారు. తమ మొక్కులు తీర్చుకున్నవారు, కోరికలు కోరుకునేందుకు వచ్చిన వారు స్వర్ణాల చెరువులో స్నానం చేసి, రొట్టెలను మార్చుకుంటున్నారు.
Nellore District
Barashahid Darga
Rottela Pandaga

More Telugu News