Vijayawada: విజయవాడలో పరువు హత్య పోస్టర్లు.. అప్రమత్తమైన పోలీసులు!

  • సత్యనారాయణపురం శివాలయంలో పోస్టర్లు
  • సోని రాహు ప్రియ పరువు హత్యకు గురవుతారని హెచ్చరిక
  • విచారణ జరుపుతున్న పోలీసులు
ఇటీవలి కాలంలో చోటుచేసుకున్న వరుస పరువు హత్యలు కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. తాజాగా మిర్యాలగూడ పరువు హత్య తరహాలో ‘సోని రాహు ప్రియ’లు పరువు హత్యకు గురవుతారని విజయవాడలో పోస్టర్లు వెలిశాయి. నగరంలోని సత్యనారాయణపురం శివాలయం వీధిలో ఈ పోస్టర్లను గుర్తు తెలియని వ్యక్తులు అంటించారు. దీంతో ఈ ఘటనపై పోలీసులు అప్రమత్తమయ్యారు.

ఈ పోస్టర్లను ఎవరు, ఎందుకు అంటించారన్నది తెలియరాలేదు. పోస్టర్ల విషయం తెలుసుకుని ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు ఎవరు అంటించారు? అసలు ఈ సోని రాహు ప్రియ ఎవరు? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. భయపెట్టే ఉద్దేశంతోనే ఈ పోస్టర్లను వీధిలో అంటించి ఉంటారని అధికారులు భావిస్తున్నారు.
Vijayawada
honour killing
soni
rahul
priya
Police

More Telugu News