TV Actress: మనస్తాపంతో తమిళ టీవీ నటి నీలాణి ఆత్మహత్యా యత్నం

  • చెన్నై, కె.కె.నగర్‌ ఇంట్లో ఘటన
  • కొన్నాళ్లు లలిత్‌ తో సహజీవనం 
  • లలిత్ ఆత్మహత్య నేపథ్యంలో నీలాణిపై విమర్శలు 
  • మనస్తాపంతో ఆత్మహత్యా యత్నం 
తమిళ టీవీ నటి నీలాణి చెన్నై, కేకే నగర్‌లోని తన స్వగృహంలో ఆత్మహత్యా యత్నం చేసింది. అసిస్టెంట్‌ డైరెక్టర్‌ గాంధీ లలిత్‌కుమార్‌ ఆత్మహత్య అనంతరం వస్తున్న కామెంట్లు, మీడియాలో జరుగుతున్న ప్రచారంతో మనస్తాపానికి, ఒత్తిడికి గురైన నీలాణి విషం తాగి ప్రాణం తీసుకునేందుకు ప్రయత్నించిందని భావిస్తున్నారు. ప్రస్తుతం తమిళ సీరియల్‌ శివగామిలో నీలాణి నెగెటివ్‌ రోల్‌లో నటిస్తోంది. ఈమె గాంధీ లలిత్‌కుమార్‌తో కొన్నేళ్లు సహజీవనం చేసిందని సమాచారం.

ఈ నేపథ్యంలో లలిత్‌ ఆమెను పెళ్లి చేసుకుందామని కోరగా, దీనికి నీలాణి నిరాకరించిందట. ఈ కక్షతో లలిత్ తనను వేధిస్తున్నాడంటూ గతంలో మైలాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌లో అతనిపై ఫిర్యాదు చేసింది. ఈ వివాదం నడుస్తుండగా లలిత్‌ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇందుకు నీలాణియే కారణమన్న ఆరోపణలు ఎక్కువయ్యాయి. మీడియా తన క్యారెక్టర్‌కు మచ్చతెచ్చేలా ఆరోపణలు చేస్తోందంటూ నీలాణి పోలీస్‌ కమిషనర్‌ కార్యాయంలో ఫిర్యాదు కూడా చేసింది. సామాజిక మాధ్యమాలు, మీడియా కవరేజీ తనను టార్గెట్ చేశాయని తన ఫిర్యాదులో పేర్కొంది. తాజాగా ఆమె ఆత్మహత్యా యత్నం చేయడంతో ఇందుకు ఒత్తిడికి గురికావడమే కారణమని భావిస్తున్నారు. ప్రస్తుతం నీలాణికి ఐసియూలో చికిత్స అందిస్తున్నారు.
TV Actress
Tamilnadu
suicide

More Telugu News