Chiranjeevi: చిరంజీవి, పవన్ కల్యాణ్ ల మధ్య తేడా ఇదే: చరణ్ రాజ్

  • చిరంజీవి చాలా హార్డ్ వర్కర్.. పవన్ స్వీట్ పర్సన్
  • ఎవరికీ అపకారం చేయని వ్యక్తి పవన్
  • చిన్న వయసులోనే రాజకీయాల్లోకి రావాలనుకోవడం దైవేచ్ఛ
మెగాస్టార్ చిరంజీవి చాలా రెబల్ అని, హార్డ్ వర్కర్ అని ప్రముఖ సినీ నటుడు చరణ్ రాజ్ అన్నారు. ఏదైనా సీన్ కానీ, ఫైట్ కానీ, డ్యాన్స్ కానీ, డైలాగ్ కానీ పర్ఫెక్ట్ గా వచ్చేంత వరకు ఆయన వదిపెట్టరని చెప్పారు. అంతటి డెడికేషన్ పవన్ కల్యాణ్ లో కూడా తను చూశానని తెలిపారు. పవన్ చాలా స్వీట్ పర్సన్ అని, ఎవరికీ ఎలాంటి అపకారం చేసే మనస్తత్వం లేని వ్యక్తి అని చెప్పారు. తన పని మాత్రమే ఆయన చూసుకుంటారని, పక్కవారి విషయాల్లో వేలు పెట్టడం కానీ, విమర్శించడం కానీ చేయరని అన్నారు. చిరంజీవి, పవన్ ఇద్దరూ గొప్ప వ్యక్తిత్వం కలిగిన మనుషులని కితాబిచ్చారు. ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చరణ్ రాజ్ ఈ మేరకు స్పందించారు.

పవన్ కల్యాణ్ చిత్రం 'గుడంబా శంకర్'లో నటించే అవకాశం వచ్చినా, కొన్ని కారణాల వల్ల నటించలేకపోయానని... ఆ తర్వాత 'పులి' చిత్రంలో నటించానని చరణ్ రాజ్ చెప్పారు. చిన్న వయసులోనే ప్రజాసేవ చేసేందుకు... రాజకీయాల్లోకి పవన్ వచ్చారని... ఆయనకు ఆ ఆలోచన రావడం దైవేచ్ఛ అని అన్నారు. ఆయనకు బలాన్ని, ప్రజల మద్దతును ఇవ్వాలని దేవుడుని కోరుకుంటున్నానని చెప్పారు. 
Chiranjeevi
Pawan Kalyan
charan raj
tollywood

More Telugu News