Telangana: కూకట్ పల్లి నియోజక వర్గంపై గురి పెట్టిన సినీ నటుడు జీవీ!

  • ఐ లవ్‌ కూకట్‌ పల్లి... అక్కడి నుంచే పోటీ చేస్తానని ప్రకటన
  • భవిష్యత్తు కార్యాచరణ త్వరలో వెల్లడిస్తానన్న జీవీ
  • కుల, మతాల పేరుతో ప్రజల్ని విడదీస్తున్న పాలకులు 
సినిమాల్లో విలన్‌ వేషాలు వేసే ప్రముఖ సినీ నటుడు జి.వి.సుధాకర్‌నాయుడు ‘కూకట్‌ పల్లి’ హీరో కావాలని ఆశిస్తున్నారు. తన రాజకీయ జీవితం ముహూర్తపు షాట్‌కు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. శుక్రవారం కూకట్‌పల్లి హౌసింగ్‌ బోర్డు కాలనీలో విలేకరులతో మాట్లాడుతూ తన మనసులో మాట వెల్లడించారు.

‘ఐ లవ్‌ కూకట్‌ పల్లి... అందుకే ఇక్కడి నుంచే పోటీ చేయాలనుకుంటున్నాను’ అని ప్రకటించారు. త్వరలో రాజకీయ భవిష్యత్తు కార్యాచరణ వెల్లడిస్తానని తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాల పాలకులు కులాలు, మతాల పేరుతో ప్రజల్ని విడదీస్తున్నారని, వారికి ఎన్నికల సమయంలో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.
Telangana
Kukatpalli
Sudhakarnaidu

More Telugu News