Chandrababu: నేడు కర్నూలు జిల్లాలో చంద్రబాబు పర్యటన.. అనంతరం అమెరికాకు పయనం

  • గోరుకల్లు, పులికనుమ ప్రాజెక్టులను జాతికి అంకితం చేయనున్న సీఎం
  • జీఎన్ఎస్ఎస్ హెడ్ రెగ్యులేటర్ వద్ద జలసిరికి హారతి
  • అవుకు కుడి టన్నెల్ నుంచి గండికోట రిజర్వాయర్ కు నీటి విడుదల
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. పర్యటన సందర్భంగా గోరుకల్లు, పులికనుమ ప్రాజెక్టులను ముఖ్యమంత్రి జాతికి అంకితం చేయనున్నారు. జీఎన్ఎస్ఎస్ హెడ్ రెగ్యులేటర్ దగ్గర జలసిరికి హారతి కార్యక్రమంలో పాల్గొననున్నారు. అనంతరం అవుకు కుడి టన్నెల్ నుంచి 10వేల క్యూసెక్కుల నీటిని గండికోట రిజర్వాయర్ కు విడుదల చేయనున్నారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో టీడీపీ శ్రేణులు, అధికార యంత్రాంగం విస్తృతమైన ఏర్పాట్లను చేశారు. అనంతరం ఆయన అమెరికా పర్యటనకు బయల్దేరుతారు. 
Chandrababu
kurnool
america

More Telugu News