Errabelli: కన్నతల్లిలాంటి టీడీపీని వీడటానికి కారణం ఇదే: ఎర్రబెల్లి

  • నియోజకవర్గ ప్రజల అభివృద్ధి కోసమే టీఆర్ఎస్ లో చేరా
  • కాంగ్రెస్ నేతల మాటలు నమ్మి, ఓటును వృథా చేసుకోవద్దు
  • ప్రజలు మళ్లీ గెలిపిస్తారన్న నమ్మకం ఉంది
నాలుగున్నరేళ్ల కాలంలో నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశానని... ప్రజలు తనను మళ్లీ గెలిపిస్తారన్న నమ్మకం తనకు ఉందని టీఆర్ఎస్ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. నియోజకవర్గ ప్రజల అభివృద్ధి కోసమే కన్నతల్లి లాంటి టీడీపీని వీడి, టీఆర్ఎస్ లో చేరానని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్పే మాటలు నమ్మి, ఓటును వృథా చేసుకోవద్దని ప్రజలను కోరారు. పెర్కవేడు, మైలారం, తిర్మలాయపల్లి గ్రామాల్లో వినాయక నవరాత్రి ఉత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించి, అన్నదాన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ, ఆయన పైవ్యాఖ్యలు చేశారు. 
Errabelli
TRS
Telugudesam
congress
Telangana

More Telugu News