kcr: వీరాభిమానం.. కేసీఆర్‌కు గుడి కట్టించిన కానిస్టేబుల్!

  • కేసీఆర్ పాలనకు ముగ్ధుడైన శ్రీనివాస్
  • అరవై ఏళ్లలో జరగని అభివృద్ధి నాలుగున్నరేళ్లలో...
  • కేసీఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందింది
రాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనకు ముగ్ధుడైన ఓ కానిస్టేబుల్ ఆయనకు గుడి కట్టించి తన అభిమానాన్ని చాటుకున్నాడు. నల్లగొండ జిల్లా నిడమనూరు మండల కేంద్రానికి చెందిన శ్రీనివాస్ పోలీస్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. కేసీఆర్ పాలన ఆయనకు చాలా నచ్చిందట. ఆయనపై తన అభిమానాన్ని మాటల్లో చెప్పలేక ఏకంగా గుడికట్టేశాడు. గత అరవై ఏళ్లలో జరగని అభివృద్ధి నాలుగున్నరేళ్ల టీఆర్ఎస్ పార్టీ హయాంలో జరిగిందని శ్రీనివాస్ పేర్కొన్నాడు. కేసీఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందిందని అంటున్నాడు. 
kcr
Telangana

More Telugu News