kareena kapoor: కరీనా కపూర్ పుట్టిన రోజు వేడుకలో ఆకట్టుకున్న కేక్!

  • పటౌడీ ప్యాలెస్‌లో కరీనా బర్త్ డే వేడుక 
  • నల్లని దుస్తుల్లో.. చేతిలో పానీయంతో అందమైన బొమ్మ
  • హాజరైన కుటుంబ సభ్యులు
బాలీవుడ్ బ్యూటీ కరీనా కపూర్ తన 38వ పుట్టినరోజు వేడుకను వైభవంగా జరుపుకుంది. అయితే ఈ పుట్టిన రోజు వేడుకలో కట్ చేసిన కేక్ ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటోంది. నల్లని దుస్తుల్లో.. చేతిలో పానీయంతో అందమైన బొమ్మను కేక్‌పై అలంకరించారు. ‘నువ్వు మా రాక్‌స్టార్’ అని కేక్‌పై రాశారు. కరీనా పుట్టినరోజును ఆమె భర్త, బాలీవుడ్‌ నటుడు సైఫ్‌ అలీ ఖాన్‌ తన పటౌడీ ప్యాలెస్‌లో వైభవంగా నిర్వహించారు.

వేడుకల్లో కరీనా సోదరి క‌రిష్మా క‌పూర్, తల్లిదండ్రులు బ‌బి‌త, ర‌ణ‌ధీర్ క‌పూర్‌, సైఫ్ సోద‌రి సోహా అలీఖాన్‌, ఆమె భ‌ర్త కునాల్ ఖేము తదితరులు పాల్గొన్నారు. బర్త్‌డే వేడుకకు సంబంధించిన ఫొటోలను కరిష్మా ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ప్రస్తుతం కరీనా ఎక్కువ సమయం కుటుంబానికే కేటాయిస్తున్నారు. కుమారుడు తైమూర్‌ అలీ ఖాన్‌ చిన్నవాడు కావడంతో అతని కోసం ఏడాదికి కేవలం రెండు సినిమాలే చేస్తానని కరీనా ఇటీవల మీడియాకు తెలిపారు.
kareena kapoor
saif ali khan
karishma kapoor
soha ali khan
birthday cake

More Telugu News