Chandrababu: చిన్న కేసును అడ్డం పెట్టుకుని చంద్రబాబు హడావిడి చేస్తున్నారు: బొత్స సత్యనారాయణ

షార్ట్స్‌లో చూడండి
నాడు బాబ్లీ ప్రాజెక్టు వద్ద జరిగిన నిరసన ప్రదర్శనల్లో భాగంగా విధుల్లో ఉన్న పోలీసులను అడ్డుకున్నారని, దాన్ని అతిక్రమించారని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ విషయమై వైసీపీ నేత బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ, ఓ చిన్న కేసును అడ్డం పెట్టుకుని చంద్రబాబు హడావిడి చేస్తున్నారని, పెద్ద పెద్ద కేసుల్లోనే ఆయన స్టేలు తెచ్చుకున్న విషయాన్ని ప్రస్తావించారు. బాబ్లీ కేసులో చంద్రబాబువి ఒట్టి డ్రామాలని, ఇదంతా ఊహించినదేనని, ఎందుకంటే, వ్యవస్థను మేనేజ్ చేయడంలో, భ్రష్టు పట్టించడంలో ఆయన దిట్ట అని ఆరోపించారు.  
Go Back to Shorts
Chandrababu
botsa

More Telugu News