Uttam Kumar Reddy: నలుగురు సుఖంగా బతకడానికి 4 కోట్ల మంది ప్రజలను వాడుకుంటున్నారు: ఉత్తమ్

  • కేసీఆర్ అంత అత్యంత బద్దకస్తుడైన సీఎంను చూడలేదు
  • కేసీఆర్‌ను ఓడించకుంటే అందరికీ ప్రమాదం
  • ఉద్యోగస్తులంతా మహాకూటమికి మద్దతు పలకాలి
నలుగురు సుఖంగా బతకడానికి 4 కోట్ల మంది ప్రజలను వాడుకుంటున్నారని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ధ్వజమెత్తారు. తెలంగాణ ఎంప్లాయిస్ అసోసియేషన్ 17వ వార్షకోత్సవ సభకు ఉత్తమ్, చాడ వెంకటరెడ్డి, కోదండరాం, ఎల్.రమణ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ.. కేసీఆర్ అంత అత్యంత బద్ధకస్తుడైన సీఎంను చూడలేదన్నారు.

వచ్చే ఎన్నికల్లో కేసీఆర్‌ను ఓడించకుంటే అందరికీ ప్రమాదమేనని ఉత్తమ్ పేర్కొన్నారు. ప్రజల ఆకాంక్ష మేరకు ఉద్యోగస్తులంతా మహాకూటమికి మద్దతు పలకాలని ఆయన కోరారు. తెలంగాణ రాష్ట్రం రావడానికి కారణమైన ఉద్యోగులను అధికారంలోకి వచ్చాక మరచిపోయారన్నారు. కేసీఆర్ కుటుంబం బయటకు వెళ్తే ప్రైవేట్ జెట్ విమానాలను వినియోగిస్తోందని ఆరోపించారు. లక్ష ఉద్యోగాల మాట కేసీఆర్ పూర్తిగా మరచిపోయారని ఉత్తమ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Uttam Kumar Reddy
kcr
telangana employees

More Telugu News