gulam nabi azad: గులాంనబీ ఆజాద్ పై మండిపడ్డ హరీశ్ రావు

  • తెలంగాణపై ఆజాద్ తప్పుడు ప్రకటనలు చేస్తున్నారు
  • ప్రజల తిరుగుబాటు, కేసీఆర్ దీక్ష వల్లే రాష్ట్రం వచ్చింది
  • టీఆర్ఎస్ లేకపోతే తెలంగాణ రాష్ట్రం ఇచ్చేవారా?
తెలంగాణపై తప్పుడు ప్రకటనలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ పై మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. ప్రజలు పోరాడి తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నారని, కేసీఆర్ దీక్ష ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని అన్నారు.

నాడు తెలంగాణ ఉద్యమాన్ని అణచివేసింది కాంగ్రెస్ పార్టీయేనని, ప్రజలు తిరగబడితే, కేసీఆర్ దీక్ష చేయడం వల్లే కొత్త రాష్ట్రం ఏర్పాటుకు నాడు కాంగ్రెస్ అంగీకారం తెలిపిందని అన్నారు. టీఆర్ఎస్ లేకపోతే తెలంగాణ రాష్ట్రం ఇచ్చేవారా? ఈ ప్రశ్నకు ఆజాద్ సమాధానం చెప్పాలి? అంటూ హరీశ్ రావు ఘాటు వ్యాఖ్యలు చేశారు.  
gulam nabi azad
Harish Rao

More Telugu News