nagarjuna: 'దేవదాస్' పైనే ఆకాంక్ష సింగ్ ఆశలు

  • గతంలో 'మళ్లీ రావా' చేసిన ఆకాంక్ష సింగ్
  • ఆ తర్వాత అవకాశాలు లేక గ్యాప్ 
  • నాగార్జున సరసన దక్కిన ఛాన్స్        
నాగార్జున .. నాని కథానాయకులుగా శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో 'దేవదాస్' నిర్మితమైంది. ఈ సినిమాలో నాని జోడీగా రష్మిక మందన నటించగా, నాగార్జున సరసన నాయికగా ఆకాంక్ష సింగ్ అలరించనుంది. గతంలో 'మళ్లీ రావా' సినిమా ద్వారా ఆకాంక్ష సింగ్ తెలుగు తెరకి పరిచయమైంది. అయితే ఆ తర్వాత ఆమెకి అవకాశాలు రాలేదు.

తెలుగు ప్రేక్షకులకు గుర్తులేకపోయినప్పటికీ 'దేవదాస్'లో నాగార్జున సరసన కథానాయికగా ఛాన్స్ ను కొట్టేసింది. ఈ సినిమా పైనే ఆమె ఎన్నో ఆశలు పెట్టుకుంది. 'దేవదాస్' విజయాన్ని సాధిస్తే తనకి మరిన్ని అవకాశాలు వస్తాయనే నమ్మకంతో ఆకాంక్ష సింగ్  వుంది. ఆమెను చూసినవాళ్లు .. సీనియర్ హీరోల జోడీగా ఆమె బాగానే వుంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం  చేస్తున్నారు. అందువలన ఆమె సీనియర్ హీరోల సరసన ఛాన్సులను పొందే అవకాశాలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి.       
nagarjuna
nani
rashmika'

More Telugu News