telangana: కూటమిలోని పార్టీల బలాబలాలపై ఫ్లాష్ సర్వే చేపట్టిన కాంగ్రెస్.. రెండు రోజుల్లో సర్వే ఫలితాలు!

  • కూటమిలో సీట్ల సర్దుబాటుపై సుదీర్ఘ చర్చలు  
  • తొలి దశ చర్చలు పూర్తి 
  • అనంతరం సీట్ల సర్దుబాటు
టీఆర్ఎస్ ఓటమే లక్ష్యంగా తెలంగాణలో కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, టీజేఎస్ లు మహాకూటమిగా ఏర్పడిన సంగతి తెలిసిందే. ఈ పార్టీల మధ్య గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న సీట్ల సర్దుబాటు అంశం ఒక కొలిక్కి రానున్నట్టు తెలుస్తోంది. మహాకూటమిలోని కీలక నేతలు సీట్ల సర్దుబాటుపై సుదీర్ఘ చర్చలు జరుపుతున్నారు. ఇప్పటికే తొలి దశ చర్చలు పూర్తయ్యాయి.

ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో ఫ్లాష్ సర్వేను చేపట్టింది. మరో రెండు రోజుల్లో ఈ సర్వే ఫలితాలు రానున్నాయి. సర్వే ఆధారంగా నియోజకవర్గాల వారీగా కూటమిలోని పార్టీల బలాబలాలను కాంగ్రెస్ పార్టీ అంచనా వేయనుంది. అనంతరం సీట్ల సర్దుబాటుపై తుది విడత చర్చలు జరిపి... సీట్ల పంపకాలను ఖరారు చేయనున్నారు.
telangana
congress
Telugudesam
tjs
cpi
maha kurami
flash survey

More Telugu News