ntr: రాజమౌళి సినిమాకి మాటల రచయితగా సాయిమాధవ్ బుర్రా?

షార్ట్స్‌లో చూడండి
అపజయమెరుగని దర్శక ధీరుడిగా రాజమౌళి తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. ఎన్టీఆర్ .. చరణ్ హీరోలుగా ఆయన ఒక మల్టీ స్టారర్ మూవీని ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అందుకు సంబంధించిన పనుల్లోనే ఆయన బిజీగా వున్నారు. ఈ సినిమా కథ బ్రిటీష్ కాలానికి చెందినదని తెలుస్తోంది. అందువలన సంభాషణలు మరింత ప్రత్యేకతను సంతరించుకోనున్నాయి.ఈ సినిమాకి సంభాషణలను అందించే బాధ్యతను బుర్రా సాయిమాధవ్ కి అప్పగించినట్టుగా సమాచారం. అందుకు సంబంధించిన అగ్రిమెంట్ కూడా జరిగిపోయినట్టు చెబుతున్నారు. ఈ సినిమాకి సంబంధించి బ్రిటీష్ కాలానికి చెందిన సెట్స్ ను రామోజీ ఫిల్మ్ సిటీలో .. అల్యూమినియం ఫ్యాక్టరీ పరిసరాల్లో సిద్ధం చేస్తున్నారు. వచ్చేనెల నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది.    
Go Back to Shorts
ntr
charan

More Telugu News