Janasena: జనసేన అధినేతను కలిసిన ‘చదలవాడ’.. పార్టీ మారుతారన్న ఊహాగానాలు

  • విజయదశమికి ముహూర్తం ఖరారు చేసుకున్నట్లు ప్రచారం
  • కొన్నాళ్లుగా అధికార పార్టీతో అంటీముట్టనట్లున్న టీటీడీ మాజీ చైర్మన్‌
  • ముఖ్యమంత్రి కార్యక్రమాలకు కూడా దూరం
తిరుపతి మాజీ ఎమ్మెల్యే, టీటీడీ మాజీ చైర్మన్‌ చదలవాడ కృష్ణమూర్తి జనసేన పార్టీ వైపు చూస్తున్నట్టు తెలుస్తోంది. గత కొంతకాలంగా అధికార టీడీపీ కార్యక్రమాలకు, సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పాల్గొనే కార్యక్రమాలకు కూడా దూరంగా ఉంటూ వస్తున్న చదలవాడ హఠాత్తుగా గురువారం జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ను హైదరాబాద్‌లో కలవడం చర్చనీయాంశమైంది.

జనసేనాని ఇచ్చిన హామీతో విజయదశమికి ఆ పార్టీ కండువా కప్పుకునేందుకు ఆయన ఏర్పాట్లు చేసుకుంటున్నారని సమాచారం. ఇదే నిజమైతే తిరుపతి పట్టణంలో జనసేన పార్టీకి పెద్ద దిక్కు లభించినట్టవుతుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.
Janasena
chadalavaada
Tirupathi

More Telugu News