Anantapur District: విచ్చలవిడి శృంగారం లేదు, మాదకద్రవ్యాలు లేవు... ప్రబోధానంద ఆశ్రమం నుంచి పోలీసుల ఉపసంహరణ!

  • అనంతపురం జిల్లాలో ప్రబోధానంద ఆశ్రమం
  • ఆశ్రమంపై పలు ఆరోపణలు
  • అన్నీ అవాస్తవాలేనంటున్న పోలీసులు
అనంతపురం జిల్లాలోని ప్రబోధానంద ఆశ్రమం నుంచి స్పెషల్ పార్టీ పోలీసులను క్రమంగా ఉపసంహరిస్తున్నారు. ఈ ఆశ్రమంపై ఆరోపణలు వచ్చిన విధంగా అక్కడ అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్టు సాక్ష్యాధారాలు లభించలేదని తెలుస్తోంది. గత రెండు రోజులుగా ప్రబోధానంద ఆశ్రమంలో పోలీసు, రెవెన్యూ అధికారులు క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టి, ఇక్కడ విచ్చలవిడి శృంగారం జరుపుతున్న ఆనవాళ్లేవీ లభించలేదని వెల్లడించారు.

 జేసీ దివాకర్ రెడ్డి తదితరులు ఆరోపించినట్టుగా మాదకద్రవ్యాలు, కండోమ్ ప్యాకెట్లు, మద్యం సీసాలు లభించలేదని అన్నారు. ఇక్కడి నుంచి క్రమంగా పోలీసులను ఉపసంహరిస్తామని తెలిపారు. అయితే, ఆధార్ కార్డులు లేనివారిని మాత్రం ఆశ్రమం నుంచి బయటకు పంపించి వేస్తున్నామని, వారిని వారి స్వస్థలాలకు చేరుస్తున్నామని అన్నారు. ఇప్పటివరకూ సుమారు 250 మందిని ఆశ్రమం నుంచి పంపించివేశామన్నారు.
Anantapur District
Prabodananda
Asramam

More Telugu News