Richa chadda: జార్జియాలో హీరోయిన్ రిచా చద్దాకు అవమానం!

  • జార్జియాలో షూటింగ్ కు వెళ్లిన రిచా
  • జాతి వివక్షను ప్రదర్శించిన పాస్ పోర్ట్ అధికారిణి
  • అర్థంకాని భాషలో గొణిగిందన్న రిచా చద్దా
బాలీవుడ్ హీరోయిన్ రిచా చద్దా జార్జియాకు వెళ్లిన వేళ అవమానం ఎదురైంది. తనకు ఎదురైన అనుభవాన్ని ఆమె స్వయంగా తెలియజేస్తూ, పాస్‌ పోర్ట్ కంట్రోల్‌ లో ఉన్న ఓ లేడీ ఆఫీసర్, తనపై జాతి వివక్షను ప్రదర్శించిందని వాపోయింది. తన పాస్‌ పోర్ట్ ను టేబుల్ పైకి రెండుసార్లు విసిరేసిందని, తనకు అర్థంకాని జార్జియా భాషలో గొణుక్కుందని చెప్పింది. గట్టిగా అరుస్తూ తొందరపెట్టిందని, అటువంటి అధికారిని చూస్తూ ఆ దేశాన్ని విడిచిపెట్టడం తనకు బాధగా అనిపించిందని రిచా చద్దా తెలిపింది.

ఇదే సమయంలో జార్జియాలో తనకు తారసపడిన క్యాబ్ డ్రైవర్ పై రిచా పొగడ్తల వర్షం కురిపించింది. అతను చాలా మంచి వ్యక్తని, తాము సైగల ద్వారా మాట్లాడుకున్నామని, అతని సహృదయాన్ని తాను అర్థం చేసుకున్నానని చెప్పింది. కాగా, 'ఇన్‌సైడ్ ఎడ్జ్' అనే ఇండియన్-అమెరికన్ వెబ్ టెలివిజన్ సిరీస్‌ కోసం రిచా చద్దా జార్జియా వెళ్లింది.
Richa chadda
Jorgia
Shooting
Inside Edge

More Telugu News