Manoharachari: రైలు కిందపడి ఆత్మహత్య చేసుకోవాలనుకున్న మనోహరాచారి!

  • నడిరోడ్డుపై కుమార్తెను చంపే ప్రయత్నం
  • కూతుర్ని చంపి, ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్న మనోహరాచారి
  • విషయం భార్యకు చెప్పడంతో, పోలీసులకు సమాచారం
తనకు ఇష్టంలేని కులాంతర వివాహాన్ని చేసుకుందన్న ఆగ్రహంతో నడిరోడ్డుపై, నలుగురూ చూస్తుండగానే కుమార్తెను హత్య చేయాలని ప్రయత్నించిన మనోహరాచారి, తన కుమార్తెను చంపిన తర్వాత, తానూ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడట. అందుకే దాడి తర్వాత కూతురు మరణించిందని భావించి, రైలు కింద పడాలన్న ఉద్దేశంతోనే ఆయన మక్తా ప్రాంతానికి వెళ్లాడని తెలుస్తోంది.

తాను ఆత్మహత్య చేసుకోబోతున్నానని భార్య లక్ష్మికి మనోహరాచారి చెప్పడంతో, ఆమె అప్రమత్తమై, వెంటనే విషయాన్ని ఎస్సార్ నగర్ పోలీసులకు సమాచారం అందించింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు, ఆయన సెల్ ఫోన్ ను ట్రాక్ చేసి, మూడు గంటల పాటు శ్రమించి అతన్ని అరెస్ట్ చేశారు. కాగా, నిన్న నిందితుడిని జ్యుడీషియల్ రిమాండుకు తరలించిన పోలీసులు, అతని నుంచి మరిన్ని వివరాలు సేకరించేందుకు కస్టడీలోకి తీసుకోవాలని నిర్ణయించారు.
Manoharachari
Murder Attempt
Hyderabad
Police

More Telugu News