air india: ఎయిర్ ఇండియా స్వతంత్ర హోదా డైరెక్టర్ గా దగ్గుబాటి పురందేశ్వరి నియామకం

  • పౌరవిమానయాన శాఖ ప్రతిపాదనకు ఆమోదం
  • ఈ మేరకు డీవోపీటీ అధికారిక ఉత్తర్వులు జారీ
  • ఈ పదవిలో మూడేళ్లు కొనసాగనున్న పురందేశ్వరి
బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురందేశ్వరిని ఎయిర్ ఇండియా స్వతంత్ర హోదా డైరెక్టర్ గా నియమించారు. పౌరవిమానయాన శాఖ ప్రతిపాదనకు కేబినెట్ నియామకాల కమిటీ ఆమోదించింది. ఎయిర్ ఇండియా స్వతంత్ర హోదా డైరెక్టర్ గా ఆమెను నియమిస్తూ ఈ మేరకు డీవోపీటీ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పదవిలో ఆమె మూడేళ్ల పాటు కొనసాగనున్నారు. కాగా, పురందేశ్వరికి ఈ పదవి లభించడంపై ఏపీ బీజేపీ నేతలు హర్షం వ్యక్తం చేశారు.
air india
daggubati purandeswari

More Telugu News