mim: పవర్ పాలిటిక్స్ పై నాకు ఆసక్తి లేదు.. టీఆర్ఎస్ కు మళ్లీ అధికారం ఖాయం: అసదుద్దీన్ ఒవైసీ
- టీఆర్ఎస్ తో కలిసి అధికారం పంచుకునే ప్రసక్తే లేదు
- కేసీఆర్ అమలు చేసిన సంక్షేమ పథకాలే గెలిపిస్తాయి
- అక్బరుద్దీన్ వ్యాఖ్యలను మీడియా తప్పుగా ప్రచారం చేసింది
‘టీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకొస్తే కనుక ఆ పార్టీతో కలిసి అధికారాన్ని పంచుకుంటారా?’ అన్న ప్రశ్నకు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పవర్ పాలిటిక్స్ పై తనకు అంతగా ఆసక్తి లేదని, ఆ పార్టీతో కలిసి అధికారం పంచుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ విజయం సాధించడం ఖాయమని అభిప్రాయపడ్డారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ అమలు చేసిన సంక్షేమ పథకాలే ఆయన విజయానికి దోహదపడతాయని అన్నారు.
ఆమధ్య కర్ణాటకలో కుమారస్వామి ముఖ్యమంత్రి అయిన మాదిరే తెలంగాణలో కూడా జరగవచ్చని, తాము అధికారంలోకి రావచ్చని తాజా మాజీ ఎమ్మెల్యే, తన సోదరుడు అక్బరుద్దీన్ ఒవైసీ ఇటీవల చేసిన వ్యాఖ్యలను విలేకరులు ప్రస్తావించారు. దీనిపై ఆయన స్పందిస్తూ, అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్యలను మీడియా తప్పుగా ప్రచారం చేసిందని, మీడియా తీరంతా కట్ అండ్ పేస్ట్ అన్న రీతిలో ఉంటుందని విమర్శించారు.