terrorists: టెర్రరిజం ఎక్కువగా ఉన్న మొదటి ఐదు దేశాలు ఇవే!

  • టాప్ ఫైవ్ దేశాల్లో ఇండియా, పాక్, ఆఫ్ఘనిస్థాన్, ఇరాక్, ఫిలిప్పీన్స్
  • ఈ దేశాలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించిన అమెరికా సంస్థ
  • 2017లో 23 శాతం తగ్గిన ఉగ్రదాడులు
ఉగ్రదాడులు ఎక్కువగా జరుగుతూ, నెత్తురోడుతున్న దేశాలు మరింత జాగ్రత్తగా ఉండాలని అమెరికాకు చెందిన కౌంటర్ టెర్రరిజం కోఆర్డినేషన్ డిపార్ట్ మెంట్ తన నివేదికలో హెచ్చరించింది. ప్రపంచంలో జరుగుతున్న ఉగ్రదాడుల్లో ఆసియా దేశాల్లోనే 59 శాతం దాడులు జరుగుతున్నాయని చెప్పింది. ఇండియా, పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్, ఇరాక్, ఫిలిప్పీన్స్ దేశాలు ఉగ్రదాడులకు బలి అవుతున్న టాప్ ఫైవ్ దేశాల జాబితాలో ఉన్నాయని వెల్లడించింది. గతంలో పోల్చితే 2017లో ఉగ్రదాడులు 23 శాతం తగ్గాయని... మృతుల సంఖ్య కూడా 27 శాతం తగ్గిందని తెలిపింది. ఆసియా దేశాలే ఉగ్రదాడులకు ఎక్కువగా టార్గెట్ అవుతున్నాయని చెప్పింది. 
terrorists
attacks
india
usa
counter terrorism coordination department

More Telugu News