cathay pacific: విమానంపై పేరును తప్పు రాశారు.. విమానాన్ని వెనక్కి తిప్పి పంపిన ఎయిర్ లైన్స్!

  • 'Cathay Pacific' స్థానంలో 'Cathay Paciic'
  • మళ్లీ పెయింట్ షాప్ కు పంపిన ఎయిర్ లైన్స్
  • పెద్ద తప్పిదమే అంటున్న విమానయాన రంగం
హాంకాంగ్ కు చెందిన ప్రఖ్యాత ఎయిర్ లైన్స్ సంస్థ క్యాథే పసిఫిక్... తన కొత్త విమానాన్ని వెనక్కి తిప్పి పంపింది. దీనికి కారంణం... విమానంపై తమ పేరును తప్పుగా రాయడమే. విమానం వెలుపలి భాగంలో 'Cathay Pacific' స్థానంలో 'Cathay Paciic' అని పెయింట్ చేశారు. హాంకాంగ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో ఈ తప్పిదాన్ని ప్రయాణికులు గుర్తించడం విశేషం. వెంటనే ఈ తప్పిదాన్ని ఎయిలైన్స్ సిబ్బందికి వారు తెలియజేశారు.

దీనిపై ఎయిర్ లైన్స్ యాజమాన్యం స్పందిస్తూ, ఇది ముమ్మాటికీ పెద్ద తప్పిదమే అని వ్యాఖ్యానించింది. 'ఊప్స్... ఈ స్పెషల్ పేరు ఎంతో కాలం ఉండదు. ఇది మళ్లీ షాప్ కు వెళుతోంది' అంటూ ట్వీట్ చేసింది. ఈ అంశాన్ని క్యాథే పసిఫిక్ లైట్ గా తీసుకున్నప్పటకీ... ఏవియేషన్ రంగం మాత్రం దీన్ని ఘోర తప్పిదంగానే భావిస్తోంది.
cathay pacific
name
hongkong
airlines

More Telugu News