harish shankar: హరీశ్ శంకర్ రంగంలోకి దిగిపోయాడు

  • హరీశ్ శంకర్ నుంచి మల్టీ స్టారర్ 
  • ఒక హీరోగా సుధీర్ బాబు 
  • రామ్ తో సంప్రదింపులు
మాస్ ఆడియన్స్ పల్స్ గురించి బాగా తెలిసిన దర్శకులలో హరీశ్ శంకర్ ఒకరు. 'మిరపకాయ్' .. 'గబ్బర్ సింగ్' .. 'సుబ్రమణ్యం ఫర్ సేల్' వంటి విజయాలు హరీశ్ శంకర్ ఖాతాలో వున్నాయి. అయితే ఈ మధ్య ఆయన చేసిన 'దువ్వాడ జగన్నాథం' మాత్రం ఆశించిన స్థాయిలో ఆడలేదు. ఆ తరువాత ఆయన 'దాగుడుమూతలు' అనే టైటిల్ తో ఒక మల్టీ స్టారర్ ను రెడీ చేసుకున్నాడు. ముందుగా ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరించడానికి సిద్ధమైన దిల్ రాజు, ఆ తరువాత తప్పుకున్నారు.

అయినా హరీశ్ శంకర్ ఈ ప్రాజెక్టును పక్కన పెట్టేయ లేదు. యూఎస్ లోని తన మిత్రులతో కలిసి ఈ సినిమాను నిర్మించడానికి సిద్ధమవుతున్నాడు. ఈ మల్టీ స్టారర్లో ఒక హీరోగా ఆల్రెడీ సుధీర్ బాబును తీసుకున్నాడట. మరో హీరోగా రామ్ ను ఒప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టుగా సమాచారం. వరుస పరాజయాలతో సతమతమవుతోన్న రామ్ .. హరీశ్ శంకర్ కి గ్రీన్ సిగ్నల్ ఇస్తాడో లేదో చూడాలి.   
harish shankar

More Telugu News