charan: చరణ్ మూవీ సెట్స్ కి వచ్చిన చిరంజీవి!

  • జార్జియాలో 'సైరా' షూటింగ్
  • చిరంజీవికి దొరికిన విరామం 
  • 'అజర్ బైజాన్'లో చరణ్ షూటింగ్
చిరంజీవి కథానాయకుడిగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో 'సైరా' రూపొందుతోంది. కొన్ని రోజులుగా ఈ సినిమా షూటింగ్ జార్జియాలో జరుగుతోంది. ఇక ఆ పక్క దేశమే అయిన 'అజర్ బైజాన్'లో చరణ్ మూవీ షూటింగ్ జరుగుతోంది. బోయపాటి దర్శకత్వంలో అక్కడ కొన్ని కీలకమైన సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. డీవీవీ దానయ్య ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు.

'సైరా'లో చిరంజీవి పోర్షన్ కి సంబంధించిన షూటింగుకి కాస్త విరామం దొరకడంతో, వెంటనే ఆయన చరణ్ షూటింగు జరుగుతోన్న 'అజర్ బైజాన్'కి వెళ్లారట. చరణ్ షూటింగ్ జరుగుతోన్న లొకేషన్ కి వెళ్లి సర్ప్రైజ్ చేశారట. షూటింగ్ విశేషాలను గురించి ముచ్చటించి .. చరణ్ సినిమా టీమ్ తో సరదాగా గడిపినట్టు చెబుతున్నారు. అక్కడ నిర్మాత దానయ్య .. చిరంజీవి కలిసి దిగిన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.        
charan
boyapaati

More Telugu News