tatikonda rajaiah: ఎమ్మెల్సీ పల్లాను పట్టుకుని భోరున ఏడ్చిన రాజయ్య

  • రాజయ్య కోసం ప్రచారానికి వచ్చిన పల్లా
  • తన కోసం వచ్చిన పల్లాను చూసి విలపించిన రాజయ్య
  • రాజయ్యను ఓదార్చిన పల్లా
స్టేషన్ ఘన్ పూర్ టీఆర్ఎస్ అభ్యర్థి, మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య తీవ్ర ఉద్వేగానికి లోనయ్యారు. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డిని పట్టుకుని భోరున విలపించారు. వరంగల్ అర్బన్ జిల్లా ధర్మాసాగర్ లో నిన్న ఈ ఘటన చోటుచేసుకుంది. రాజయ్యకు మద్దతుగా పల్లా ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా తన కోసం వచ్చిన పల్లాను చూసి రాజయ్య కంటతడి పెట్టారు. ఈ సందర్భంగా రాజయ్యను పల్లా ఓదార్చారు. అనంతరం పల్లా మాట్లాడుతూ, కేసీఆర్ ప్రకటించిన తొలి జాబితాలోని పేర్లను మార్చే ప్రసక్తే లేదని తెలిపారు. కేసీఆర్ ఆదేశాల మేరకే తాను ప్రచారానికి వచ్చానని, డిప్యూటీ సీఎం కడియం ఆశీస్సులు కూడా రాజయ్యకు ఉంటాయని చెప్పారు.
tatikonda rajaiah
palla rajeswar reddy
station ghanpur
TRS

More Telugu News