Telangana: టీఆర్ఎస్ కు షాకిచ్చిన రమేశ్ రాథోడ్.. కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునేందుకు రంగం సిద్ధం!

  • ఖానాపూర్ టికెట్ ఇవ్వకపోవడంపై మనస్తాపం
  • స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేస్తానని గతంలోనే ప్రకటన
  • కాంగ్రెస్ లో చేరికపై స్పష్టత ఇచ్చిన సన్నిహితులు
మాజీ ఎంపీ, సీనియర్ నేత రమేశ్ రాథోడ్ టీఆర్ఎస్ కు షాకిచ్చారు. కేసీఆర్ ఖానాపూర్ అసెంబ్లీ టికెట్ ను మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్ కు ప్రకటించడంతో మనస్తాపానికి లోనైన రాథోడ్ పార్టీ నుంచి తప్పుకోవాలని నిర్ణయించారు. గతంలో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడిగా ఉన్న ఆయన.. ఖానాపూర్ టికెట్ ఇస్తామని గులాబీ నేతలు హామీ ఇవ్వడంతో గతేడాది తుమ్మల నాగేశ్వరరావు చొరవతో టీఆర్ఎస్ లో చేరారు.

కానీ చివరి నిమిషంలో పార్టీ టికెట్ ను నిరాకరించడంతో ఆయన మనస్తాపానికి లోనయ్యారు. త్వరలోనే రమేశ్ రాథోడ్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకుంటారని తెలుస్తోంది. టికెట్ రాకపోవడంతో ఖానాపూర్ లో తాను ఇండిపెండెంట్ గా అయినా పోటీ చేస్తానని ప్రకటించారు. మరోవైపు రాథోడ్ రేపు హైదరాబాదులోని గాంధీభవన్ లో జరిగే కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశముందని వెల్లడించాయి.
Telangana
TRS
khanapur
ramesh rathod

More Telugu News