Chandrababu: భేష్.. బాగా స్పందిస్తున్నారు.. ఎమ్మెల్సీ బుద్ధాపై చంద్రబాబు ప్రశంసలు

  • ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొడుతున్నారంటూ ప్రశంస
  • వివరణాత్మకంగా మాట్లాడుతున్నారన్న బాబు
  • అభినందించిన ఎమ్మెల్యేలు
టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్నపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రశంసల వర్షం కురిపించారు. సందర్భానుసారంగా బాగా స్పందిస్తున్నారంటూ మెచ్చుకున్నారు. బుధవారం అసెంబ్లీ సమావేశాలు ముగిసిన అనంతరం నిర్వహించిన టీడీఎల్పీ సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ.. మీడియా పాయింట్‌లో బుద్ధా వెంకన్న ప్రతి రోజు మాట్లాడుతున్న విషయాన్ని ప్రస్తావించారు.

ప్రతిపక్షాల విమర్శలను వెంకన్న వివరణాత్మకంగా తిప్పికొడుతున్నారని ప్రశంసించారు. విభిన్న రాజకీయ అంశాల మీద ఆయన చక్కగా మాట్లాడుతున్నారని కితాబిచ్చారు. మిగతా వారు అలా ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. కాగా, బుద్ధాను చంద్రబాబు ప్రశంసించడంతో మిగిలిన శాసనసభ్యులు కూడా ఆయనను అభినందించారు.
Chandrababu
Budha venkanna
MLC
Telugudesam
Andhra Pradesh

More Telugu News