పెళ్లి అనేది స్త్రీ, పురుషుల మధ్య అనుకూలతకు సంబంధించిన అంశం!: మోహన్ భగవత్
పెళ్లి అనేది స్త్రీపురుషుల మధ్య అనుకూలతకు సంబంధించిన అంశమని, అవి కులాంతర వివాహాలైనా ఇదే ప్రాతిపదిక అని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో ఏర్పాటు చేసిన ‘భవిష్య భారత్... ఆర్‌ఎస్‌ఎస్ దృక్కోణం’ పేరిట జరుగుతున్న మూడు రోజుల సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. కులాంతర వివాహాలకు ఆర్‌ఎస్‌ఎస్ ఎప్పుడూ వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. ఆర్‌ఎస్‌ఎస్ వలంటీర్లు కూడా కులాంతర వివాహాలు చేసుకోవడం సర్వసాధారణమని తెలిపారు.