raviteja: రీమేక్ మాటే వద్దని ఆ దర్శకుడికి రవితేజ చెప్పేశాడట!

  • 'తెరీ' రీమేక్ చేద్దామనుకున్న సంతోష్ శ్రీనివాస్
  • కొత్త కథ మాత్రమే చేస్తానన్న రవితేజ 
  • దసరాకి లాంచ్ చేసే అవకాశం
ప్రస్తుతం శ్రీను వైట్ల దర్శకత్వంలో రవితేజ హీరోగా 'అమర్ అక్బర్ ఆంటోని' సినిమా రూపొందుతోంది. ఇప్పటికే ఈ సినిమా చిత్రీకరణ పరంగా చివరిదశకు చేరుకుంది. ఈ సినిమా తరువాత రవితేజ .. దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నాడు. ఇది గతంలో తమిళంలో విజయ్ చేసిన 'తెరి' చిత్రానికి రీమేక్.

ముందుగా ఈ కంటెంట్ చేయడానికి రవితేజ అంగీకరించాడు. కానీ ఇటీవల ఆయన మనసు మార్చుకున్నట్టుగా చెబుతున్నారు. రీమేకులు చేయదలచుకోలేదనీ .. కొత్త కథను తయారుచేసి వినిపించమని రవితేజ అన్నాడట. దాంతో సంతోష్ శ్రీనివాస్ కొత్తగా ఒక కథను సిద్ధం చేసి .. రవితేజను ఒప్పించినట్టు సమాచారం. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. దసరా రోజున ఈ సినిమాను లాంచ్ చేయనున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే ఇతర వివరాలు తెలియనున్నాయి.   
raviteja

More Telugu News