vijay devarakonda: వివాదంలో 'నోటా'.. విడుదలపై ప్రభావం?

  • ఆనంద్ శంకర్ దర్శకుడిగా 'నోటా'
  • మాటల రచయితగా శశాంక్ వెన్నెలకంటి 
  • నిర్మాతగా జ్ఞానవేల్ రాజా  
విజయ్ దేవరకొండ హీరోగా ఆనంద్ శంకర్ దర్శకత్వంలో 'నోటా' సినిమా రూపొందింది. జ్ఞానవేల్ రాజా నిర్మించిన ఈ సినిమాను వచ్చేనెలలో తెలుగు .. తమిళ భాషల్లో విడుదల చేయాలనుకున్నారు. అయితే తాజాగా చోటుచేసుకున్న కొన్ని పరిణామాలు ఈ సినిమా విడుదలపై ప్రభావం చూపే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాకి సంభాషణలను సమకూర్చిన శశాంక్ వెన్నెలకంటి, నిర్మాత జ్ఞానవేల్ రాజాపై చెన్నై పోలీస్ కమిషనర్ కి ఫిర్యాదు చేశారు.

'నోటా' తెలుగు వెర్షన్ కోసం దర్శకుడు ఆనంద్ శంకర్ నాతో మాటలు రాయించుకున్నాడు. ఇటీవల రిలీజ్ చేసిన ట్రైలర్లో మాటల రచయితగా నాకు క్రెడిట్ ఇవ్వకుండా తన పేరు వేసుకున్నాడు. ట్రైలర్లో వున్న డైలాగ్స్ నావే .. కానీ కథ .. స్క్రీన్ ప్లేతో పాటు మాటల క్రెడిట్ కూడా ఆనంద్ శంకర్ వేసుకున్నాడు. తెలుగు వెర్షన్ డైలాగ్స్ రాసినందుకు నాకు రావలసిన డబ్బులతో పాటు, క్రెడిట్ కూడా ఇవ్వాలి. అప్పటివరకూ ఈ సినిమాను విడుదల కాకుండా చూడాలి' అంటూ ఆయన ఫిర్యాదు చేశాడు.   
vijay devarakonda

More Telugu News